ఎండాకాలంలో చల్లని మాట అంటూ
చలికాలంలో వెచ్చటి దుప్పటి అంటూ
కాని కాలంలో పసిడి మాట అనిన
ఎందరో అరుదైన మనుషులు ...
అపుడపుడు..
కాలంతో పని లేకుండా
ప్రతి మాట వడగాల్పులే అంటూ
నిందలు వేసి పక్కకు తొలగడం
నాటి నుంచి నేటి వరకు
జరుగుతున్న ఒక నిశ్శబ్ద యుద్ధం..
కాలం కరిగిపోతున్నప్పుడు
మాటల కోసం బావిని తొవ్వే
కాలం ఒకటి వస్తుందని
మాటలు పోగేసుకుని
మనిషికై ఎదురుచూసిన...
కాలం చెల్లిన మనిషి కోసం
వెతుకులాట మొదలవుతుందని...
మదిని వీడి మాట మాయమైపోతుంది
చెప్పి ఒప్పించడం నేరమే అవుతుంది..
హద్దు మీరక తప్పు కోవాలి
మాటలు చేదెక్కుతున్న కాలమిది..
నాకై
కొన్ని మాటలైనా దాచుకునే
మాటలు తెలిసిన నాటి బిలం
ఒకటి వెతకాలని ఉంది,..
నాతో... నువ్వుంటే బాగుండు